logo

ఏపీ నిట్‌కు గోదావరి జలాలు

ఏపీ నిట్‌ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు. గూడెంలోని నిట్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోదావరి శుద్ది జలాల పంపు హౌస్‌ను ఆయన, డైరెక్టర్‌ సీఎస్ఫీరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లా

Published : 27 Jan 2022 06:00 IST


పంపు హౌస్‌ను ప్రారంభించిన శాసనసభ్యుడు కొట్టు సత్యనారాయణ, డైరెక్టర్‌ సీఎస్పీరావు

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ నిట్‌ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు. గూడెంలోని నిట్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోదావరి శుద్ది జలాల పంపు హౌస్‌ను ఆయన, డైరెక్టర్‌ సీఎస్ఫీరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నిట్‌ ప్రాంగణానికి రోజుకు 1.50 లక్షల లీటర్ల నీటిని గూడెం పురపాలక సంఘం ద్వారా సరఫరా చేయనున్నామని తెలిపారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ నిర్మాణ పనుల్ని త్వరలోనే ప్రారంభించనున్నామని వివరించారు. అనంతరం డ్రెయిన్ల ఏర్పాటులో భాగంగా మ్యాపులను పరిశీలించారు. రిజిస్ట్రార్‌ పి.దినేష్‌ శంకర్‌ రెడ్డి, డీన్‌ ప్లానింగ్‌, డెవలప్‌మెంట్‌ జయరామ్‌, పురపాలక సంఘం కమిషనర్‌ బాలస్వామి, అసిస్టెంట్‌ కమిషనర్‌ సృజన, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని