logo

31 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు

జిల్లాలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7 వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు నిర్వహించాలని డీఈవో రేణుక ప్రధానోపాధ్యాయులకు ఒక ప్రకటనలో సూచించారు. వీటికి సంబంధించి ప్రశ్న పత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా రూపొందించారన్నారు. 2021-22 విద్యాసంవత్సరం ఛైల్డ్‌ ఇన్ఫో ప్రకారం

Published : 27 Jan 2022 06:00 IST

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే : జిల్లాలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7 వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు నిర్వహించాలని డీఈవో రేణుక ప్రధానోపాధ్యాయులకు ఒక ప్రకటనలో సూచించారు. వీటికి సంబంధించి ప్రశ్న పత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా రూపొందించారన్నారు. 2021-22 విద్యాసంవత్సరం ఛైల్డ్‌ ఇన్ఫో ప్రకారం డీసీఈబీ ద్వారా ప్రశ్న పత్రాలను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సంబంధిత ఎంఈవో కార్యాలయం నుంచి ప్రశ్న పత్రాలను 29న పొందాలన్నారు. పరీక్షల నిర్వహణ అనంతరం మార్కులను సీఎస్‌ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. అన్ని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా ఇవే ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహించాలన్నారు. నిబంధనను అతిక్రమించే ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని