logo

కలవరపెడుతున్న కొవిడ్‌

కొవిడ్‌ నమోదు శాతం జిల్లా ఆల్‌ టైం రికార్డును అందుకుంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకు జిల్లాలో దాదాపు 2, 000 పరీక్షలు చేయగా.. ఏకంగా 729 మందికి పాజిటివ్‌గా తేలింది. అంటే పరీక్షలు చేసిన వారిలో 36.45 శాతం మందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. కొవి

Published : 27 Jan 2022 06:00 IST

36.45 శాతం పాజిటివిటీ

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: కొవిడ్‌ నమోదు శాతం జిల్లా ఆల్‌ టైం రికార్డును అందుకుంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకు జిల్లాలో దాదాపు 2, 000 పరీక్షలు చేయగా.. ఏకంగా 729 మందికి పాజిటివ్‌గా తేలింది. అంటే పరీక్షలు చేసిన వారిలో 36.45 శాతం మందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. కొవిడ్‌ మొదటి, రెండు దశల్లోనూ ఈ స్థాయిలో కేసుల నమోదు శాతం కనిపించలేదు. ప్రస్తుతం అధికారిక పరీక్షల సంఖ్య తక్కువగా ఉన్నా పాజిటివ్‌ రేటు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. లెక్కల్లోకి రాని కేసులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ శాతం మరింత ఉంటుంది.

ధోరణి మారింది.. కొవిడ్‌ను ప్రస్తుతం ఎవ్వరూ పెద్దగా విషయంగా తీసుకోవట్లేదు. దీనికితోడు కొవిడ్‌ నిర్ధరణ అయిన తర్వాత కూడా ఇష్టానుసారం బయట తిరిగే వారి సంఖ్య బాగా పెరిగింది. జిల్లాలో క్రిస్మస్‌ పండుగకు మొదలైన సందడి ఇప్పటికీ ఆగలేదు. షాపింగ్‌ మాళ్లలో రద్దీ, ఆ తరువాత నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి సంబరాలు, కోడిపందేలు, జన సమీకరణలు తదితర అంశాలు కేసుల సంఖ్య పెరగడానికి దారితీశాయని నిపుణులు చెబుతున్నారు. మరో వారంలో కొవిడ్‌ నమోదు శాతం 50కి మించిపోయినా ఆశ్చర్యం లేదని వైద్యులంటున్నారు. బుధవారం మరణించిన ఒక్కరితో కలిపి ఈ నెలలోనే కొవిడ్‌తో జిల్లాలో ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం 2771 యాక్టివ్‌ కేసులు జిల్లాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని