logo

వన్యప్రాణుల దాహార్తి తీరేలా ఏర్పాట్లు

ఎండలు మండుతున్నాయి. నీటి వనరులు ఇంకిపోయి, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అడవుల్లో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని అడవుల్లో అపార వన్యప్రాణి సంపద ఉంది. ఇందులోని

Published : 24 May 2022 04:28 IST

అడవిలో ఏర్పాటుచేసిన సాసరు కుంట

కుక్కునూరు, న్యూస్‌టుడే: ఎండలు మండుతున్నాయి. నీటి వనరులు ఇంకిపోయి, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అడవుల్లో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని అడవుల్లో అపార వన్యప్రాణి సంపద ఉంది. ఇందులోని పాపికొండల అభయారణ్యంలో పులులు, చిరుతలతో పాటు దుప్పులు, జింకలు, కణుజులు, కుందేళ్లు వంటివి ఉన్నాయి. వాటి దాహార్తి తీర్చేందుకు చిన్నచిన్న సాసర్లు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసి, సౌరశక్తి ద్వారా వాటిని నీటితో నింపుతున్నారు. వేసవిలో అడవుల్లో నీటి వసతి లేనప్పుడు జంతువులు జనావాసాలకు దగ్గరగా వచ్చేవి. బోర్లు, బావులు, చెరువుల వద్ద దాహార్తి తీర్చుకునేవి. ఆ సమయంలో వేటగాళ్ల బారినపడేవి. నీటి వనరుల ఏర్పాటుతో వన్యప్రాణులను కాపాడినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు.

అటవీ డివిజన్‌ ఏలూరు

విస్తీర్ణం 1.30 లక్షల హెక్టార్లు

పనిచేస్తున్న సిబ్బంది 150 మంది

రేంజిలు 6

సౌరశక్తి వినియోగం

బోరుతో కుంటను నింపుతూ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని