logo

మృతదేహంతో ధర్నా

తన భర్త మృతికి ఓ న్యాయవాది, వేరే జిల్లాలో పని చేస్తున్న ఏఎస్పీ కారణమంటూ బాధితురాలు, బంధువులు మృతదేహంతో న్యాయవాది ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన సోమవారం నగరంలో చోటు చేసుకుంది. మృతుడు భార్య ప్రేమలత, బంధువులు

Published : 24 May 2022 04:28 IST

ఒత్తిడే కారణమంటూ బంధువుల ఆరోపణ

మృతుడి కుటుంబ సభ్యులు, నాయకుల ఆందోళన

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : తన భర్త మృతికి ఓ న్యాయవాది, వేరే జిల్లాలో పని చేస్తున్న ఏఎస్పీ కారణమంటూ బాధితురాలు, బంధువులు మృతదేహంతో న్యాయవాది ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన సోమవారం నగరంలో చోటు చేసుకుంది. మృతుడు భార్య ప్రేమలత, బంధువులు తెలిపిన వివరాలు.. ఏలూరు శనివారపుపేట ఇంద్రా కాలనీకి చెందిన కూకటి సోమరాజు (45), ప్రేమలత కుమారుడైన శ్యామ్‌, అదే ప్రాంతానికి చెందిన పెనుబోతుల సాయి మరికొంత మంది కలిసి ఇటీవల క్రికెట్‌ ఆడుతుండగా గొడవ జరిగి కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 9న ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు సోమరాజు తదితరులను స్టేషన్‌కు పిలిపించి కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. పట్టణంలోని న్యాయవాదితోపాటు మరో జిల్లాలో ఉన్న ఓ ఏఎస్పీ కూడా తమకు తెలుసు అని అంతా వారిద్దరే చూసుకుంటారని సాయి అమ్మ బెదిరించారు. ఈ క్రమంలోనే సోమరాజును రోజూ పోలీసు స్టేషన్‌కు పిలుస్తుండటంతో ఒత్తిడి గురై ఈ నెల 22న మృతి చెందారని ఆరోపించారు. ఇదిలా ఉండగా మధ్యవర్తులు జోక్యం చేసుకుని, ఆందోళన విరమింపజేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రాథమిక విచారణకే సోమరాజును స్టేషన్‌కు పిలిపించామని పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని