logo

ఇంకా గాడిన పడని పాలన

కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన ఇంకా కుదుట పడలేదు. ఇప్పటికే యాభై రోజులైంది. ఎప్పుడు గాడిన పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కలెక్టర్‌తో పాటు ముఖ్య విభాగాలున్న ప్రధాన కార్యాలయంలో

Published : 24 May 2022 05:23 IST

నేటికి యాభై రోజులు

జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో ఇలా..

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన ఇంకా కుదుట పడలేదు. ఇప్పటికే యాభై రోజులైంది. ఎప్పుడు గాడిన పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కలెక్టర్‌తో పాటు ముఖ్య విభాగాలున్న ప్రధాన కార్యాలయంలో ఇంకా కొన్ని పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని కార్యాలయాల్లో అయితే పూర్తి స్థాయి సామగ్రి ఇంకా సమకూరలేదనే చెప్పాలి. కలెక్టరేట్‌లో మౌలిక వసతులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో లేవు. భవనంపై భాగంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మంచి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. సోమవారం స్పందనకి వచ్చే ప్రజలు కార్యాలయ వెలుపల దాతల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో దాహం తీర్చుకుంటున్నారు. చాలా శాఖలకు సిబ్బంది కేటాయింపు కాగితాలకే పరిమితమైంది. దీంతో ఎక్కువ కార్యాలయాలు ఇప్పటికీ వెలవెలబోతున్నాయి. ఏదో నామమాత్రంగా అతి కొద్ది మంది మాత్రమే ఉద్యోగులు కనిపిస్తున్నారు.

కలెక్టర్‌ కార్యాలయంలో సాగుతున్న పనులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు