Kiran Kumar Reddy: త్వరలో వస్తా.. అందరినీ కలుస్తా: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
స్థానికులతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
కలికిరి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి కలికిరిలో బుధవారం ఘన స్వాగతం లభించింది. హైదరాబాదు నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కలికిరి రహదారులు, భవనాల శాఖ అతిధి గృహానికి ఉదయం 12:20 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి కేఎస్ అఘామోహిద్దీన్, జిల్లా కాంగ్రెస్ మాజీ కార్యదర్శి డాక్టర్ శ్రీవర్ధన్, పలువురు నాయకులు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానులను పేరుపేరునా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వచ్చిన కుమారుడు నిఖిలేష్‌కుమార్‌రెడ్డిని అందరికీ పరిచయం చేశారు. అక్కడికి చేరుకున్న యువత, కార్యకర్తలు కిరణ్‌కుమార్‌రెడ్డి కుమారుడు నిఖిలేష్‌కుమార్‌రెడ్డితో సెల్ఫీలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన స్వగ్రామం నగిరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం కలికిరికి వచ్చినట్లు సమాచారం. కలికిరిలో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కలికిరి నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట వ్యక్తిగత కార్యదర్శి క్రిష్ణప్ప, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
మదనపల్లె పట్టణం : మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డిని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. బుధవారం ఆయన మార్గంమధ్యలోని నరేష్‌కుమార్‌రెడ్డికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇటీవల ప్రమాదశాత్తు కిందపడి ఎడమచేయి స్వల్పంగా దెబ్బతింది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత మదనపల్లెలోని ఇంటికి చేరుకున్నారు. మదనపల్లె బైపాస్ రోడ్డులో నివాసముంటున్న నరేష్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: పంజాగుట్టలో దారుణం... భార్యను హతమార్చి, రైలుకింద పడి భర్త ఆత్మహత్య
-
Politics News
Maharashtra crisis: ముంబయికి రండి.. కూర్చొని మాట్లాడుకుందాం: రెబల్స్‌కు ఉద్ధవ్ విజ్ఞప్తి
-
Crime News
Crime News: పరీక్షల్లో ఫెయిల్ అవుతానని ఒకరు, తక్కువ మార్కులు వచ్చాయని మరొకరి బలవన్మరణం
-
Business News
Stock Market: ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్ నగరాలపై రష్యా మళ్లీ క్షిపణుల వర్షం!
-
Movies News
Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- ఆవిష్కరణలకు అందలం
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
- ఔరా... అనేల