logo

లోక్‌ అదాలత్‌లో 12,501 కేసుల పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలత్‌లో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 12,501 కేసులు పరిష్కరించి రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సోలమన్‌రాజు తెలిపారు. తన ఛాంబర్‌లో సోమవారం ఆయన పరిష్కారమైన కేసుల వివరాలు

Published : 28 Jun 2022 06:04 IST

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సోలమన్‌రాజు, చిత్రంలో సీనియర్‌ జడ్జి కవిత

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే : జాతీయ లోక్‌ అదాలత్‌లో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 12,501 కేసులు పరిష్కరించి రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సోలమన్‌రాజు తెలిపారు. తన ఛాంబర్‌లో సోమవారం ఆయన పరిష్కారమైన కేసుల వివరాలు వెల్లడించారు. కడపలో 5,115, జమ్మలమడుగులో 1,345, బద్వేలులో 2,565, సిద్దవటంలో 85, రాయచోటిలో 418, రాజంపేటలో 723, రైల్వేకోడూరులో 116, పులివెందులలో 279, ప్రొద్దుటూరులో 811, నందలూరులో 351, లక్కిరెడ్డిపల్లెలో 343, కమలాపురంలో 350 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. లోక్‌ అదాలత్‌ విజయవంతానికి సహకరించిన, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు, బీమాశాఖల అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సీనియర్‌ జడ్జి కవిత కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని