logo

విద్యతోనే బంగారు భవిష్యత్తు

విద్యతోనే బంగారు భవిష్యత్తు సాకారమవుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన కలెక్టర్‌ విజయరామరాజు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సుధ, రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, ఆర్టీసీ

Published : 28 Jun 2022 06:04 IST

విద్యార్థుల తల్లులకు అమ్మఒడి చెక్కును అందిస్తున్న ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, బద్వేలు,

కమలాపురం ఎమ్మెల్యేలు డాక్టర్‌ సుధ, రవీంద్రనాథరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: విద్యతోనే బంగారు భవిష్యత్తు సాకారమవుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన కలెక్టర్‌ విజయరామరాజు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సుధ, రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ, పరిశ్రమలశాఖ సలహాదారు వీరారెడ్డి, సగర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ రమణమ్మలతో కలిసి విద్యార్థుల తల్లులకు రూ.281.61 కోట్ల విలువ చేసే చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నాడునేడు పనుల కింద పాఠశాలల్లో పది రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి, డీఈవో దేవరాజు, పీవో ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఐవో రమణరాజు, డీవీఈవో శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని