logo

వృత్తిపన్ను రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసన

న్యాయవాదులు వృత్తిపన్ను చెల్లించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ ఎదుట సోమవారం అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య ఆధ్వర్యంలో న్యాయ వాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదుల సంక్షేమ

Published : 28 Jun 2022 06:04 IST

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

రాయచోటి, న్యూస్‌టుడే: న్యాయవాదులు వృత్తిపన్ను చెల్లించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ ఎదుట సోమవారం అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య ఆధ్వర్యంలో న్యాయ వాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదుల సంక్షేమ సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రాజకుమార్‌రాజు, ఆనందకుమార్‌ మాట్లాడుతూ వృత్తిలో స్థిరపడాలంటే కనీసం 5 నుంచి 10 ఏళ్లు సమయం పడుతుందని, అలాంటివారు వృత్తిపన్ను ఎలా కట్టగలరని ప్రశ్నించారు. సుమారు 80 శాతం మంది న్యాయవాదులు కనీస సంపాదన లేని పరిస్థితుల్లో ఉన్నారని అఖిలభారత న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.ఈశ్వర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2018 నుంచి 2022 వరకు ఏడాదికి రూ.2,500 చొప్పున రూ.12,500 వృత్తిపన్ను చెల్లించాలని వాణిజ్యపన్నుల శాఖ నుంచి న్యాయవాదులకు నోటీసులొస్తున్నాయన్నారు. వృత్తిపన్ను వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వారు కలెక్టర్‌ గిరీషకు వినతిపత్రం అందజేశారు. న్యాయవాదులు నాగేశ్వరరావు, ఖైరున్‌, వరలక్ష్మీ, రవిశంకర్‌, నాగార్జున, వెంకటేష్‌, రమణ, ఖిజర్‌బాషా, కల్యాణ్‌, కృష్ణయ్య, ఖాదర్‌బాషా, చిన్నయ్య, హుమయూన్‌బాషా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని