logo

నిర్మాణానికి రూ.కోట్లు... వినియోగానికి తూట్లు!

చిత్రంలో కనిపిస్తోంది కడప-చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని చెన్నూరు సమీపంలోని హజ్‌హౌస్‌ భవనం, రాయలసీయతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ముస్లిం సోదరులు హజ్‌యాత్రకు వెళ్లే క్రమంలో వారి కోసం గత ప్రభుత్వం రూ.27 కోట్లతో నిర్మించింది. దీనిని కరోనా సమయంలో కొవిడ్‌ ఆసుపత్రిగా వినియోగించారు.

Published : 07 Aug 2022 02:42 IST

చిత్రంలో కనిపిస్తోంది కడప-చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని చెన్నూరు సమీపంలోని హజ్‌హౌస్‌ భవనం, రాయలసీయతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ముస్లిం సోదరులు హజ్‌యాత్రకు వెళ్లే క్రమంలో వారి కోసం గత ప్రభుత్వం రూ.27 కోట్లతో నిర్మించింది. దీనిని కరోనా సమయంలో కొవిడ్‌ ఆసుపత్రిగా వినియోగించారు. మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన అనంతరం అందులోని సామగ్రిని కొందరు ఎత్తుకెళ్లడంతో అధికారులు తాళాలు వేశారు. ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ముళ్లచెట్లతో భవనం ప్రాంగణం కళాహీనంగా దర్శనమిస్తోంది. ఇటీవల హజ్‌ కమిటీ సభ్యులు భవనాన్ని తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.

-ఈనాడు, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని