logo

మదనపల్లెపై విశ్వకవి ముద్ర

భారతదేశ చరిత్రలో మదనపల్లెకు ఓ గుర్తింపు ఉంది. జాతి మొత్తం గర్వించే జనగణమన గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ప్రాంతంగా, జనగణమన అని బాణి కట్టిన ప్రదేశంగా ఎంతో ప్రచుర్యం పొందింది. కోట్ల మంది తలెత్తుకుని పాడుకునే జాతీయ గీతం అనువాదానికి కేంద్రమైన

Updated : 11 Aug 2022 05:51 IST

జాతీయగీతాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసిందిక్కడే!

ఠాగూర్‌మనసు దోచిన ప్రకృతి అందాలు
 న్యూస్‌టుడే, మదనపల్లె విద్య

రవీంద్రనాథ్‌ఠాగూర్‌తోఅప్పటి ఉడ్స్‌ నేషనల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జేమ్స్‌ హెన్రీ కజిన్స్‌, ఆయన సతీమణి మార్గరేట్‌ కజిన్స్‌

భారతదేశ చరిత్రలో మదనపల్లెకు ఓ గుర్తింపు ఉంది. జాతి మొత్తం గర్వించే జనగణమన గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ప్రాంతంగా, జనగణమన అని బాణి కట్టిన ప్రదేశంగా ఎంతో ప్రచుర్యం పొందింది. కోట్ల మంది తలెత్తుకుని పాడుకునే జాతీయ గీతం అనువాదానికి కేంద్రమైన మదనపల్లె చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి పోయింది. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నేషనల్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి హోదాలో 1919లో దక్షిణ భారదేశ పర్యటనలో భాగంగా బెంగళూరుకు వచ్చారు. ఆయన స్నేహితుడైన విద్యావేత్త, సామాజిక కార్యకర్త చార్లెస్‌ ఫెరర్‌ ఆండ్రూస్‌ సూచనతో విశ్వకవి బస చేసేందుకు మదనపల్లె ప్రాంతం సరైనదిగా గుర్తించి సలహా ఇచ్చారు. దీంతో ఆయన 1919 ఫిబ్రవరి 24న ప్రత్యేకంగా కేటాయించిన బోగీలో సీటీఎం రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అప్పటి ఉడ్స్‌ నేషనల్‌ కళాశాల (ప్రస్తుత బీటీ కళాశాల) ప్రిన్సిపల్‌ జేమ్స్‌ హెన్రీ కజిన్స్‌ ఆయన సతీమణి మ్యూజిక్‌ అధ్యాపకురాలైన మార్గరేట్‌ కజిన్స్‌ సీటీఎం వెళ్లి రైల్వేస్టేషన్‌లో దిగిన రవీంద్రనాథ్‌కు స్వాగతం పలికారు. కళాశాల సమీపంలోని ఓ కాటేజీని బసచేసేందుకు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఆయన మదనపల్లెలోనే ఉన్నారు.


దక్షిణ భారత శాంతినికేతన్‌గా కితాబు  
ఉడ్స్‌ నేషనల్‌ కళాశాలకు విచ్చేసిన రవీంద్రుడు మదనపల్లె పట్టణం చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయత, సెలయేర్లు, ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ముగ్దుడై అప్పటికే తాను బెంగాలీలో రాసిన జనగణమనను ఫిబ్రవరి 25న ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. మరుసటి రోజు కళాశాలలో పర్యటిస్తుండగా మ్యూజిక్‌ అధ్యాపకురాలు మార్గరేట్‌ కజిన్స్‌ ఆధ్వర్యంలో జరిగే సింగ్‌ ఫర్‌ సాంగ్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆ కార్యక్రమంలో భాగంగా పిల్లలు పాటలు పాడటాన్ని చూసి తాను తర్జుమా చేసిన ప్రతిని మార్గరేట్‌ కజిన్స్‌కు అందజేశారు. ఆమె అప్పటికప్పుడు ఆ ప్రతి తీసుకుని జనగణమన అని బాణికట్టి విద్యార్థులతో పాడించారు. విద్యార్థులతో పాటు ఠాగూర్‌ పాటకు జతకలిపారు. దానికి మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియాగా అప్పట్లో ప్రకటించారు. అప్పటి ఉడ్స్‌ నేషనల్‌ కళాశాలను దక్షిణ భారతదేశ శాంతినికేతన్‌గా అభివర్ణించారు. ఆయన బసచేసిన కాటేజీ ‘ఠాగూర్‌ కాటేజీ’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మై సీవీఆర్‌ ఫౌండేషన్‌ అందజేసిన విశ్వకవి చిత్రపటాలను ప్రదర్శనకు ఉంచారు.  


వందనాలయ్యా పొన్నతోట వెంకటరెడ్డి

లింగాల, న్యూస్‌టుడే : స్వాతంత్య్ర సంగ్రామంలో పులిగడ్డ నుంచి ఎందరో ఉద్యమ బరిలో నిలిచి బ్రిట్రిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి జైలుపాలయ్యారు. సింహాద్రిపురం మండలం అంకాళమ్మగూడూరుకు చెందిన పొన్నతోట వెంకటరెడ్డి జిల్లా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1940-41లో స్వాతంత్య్ర ఉద్యమ ప్రభావంతో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1943 ఆగస్టులో బ్రిటిష్‌ ప్రభుత్వం నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా పని చేసినందుకు పులివెందుల సబ్‌జైలులో మూడువారాలు ఉంచారు. అదే ఏడాది ఉపాధ్యాయుడిగా అంకాశమ్మ గూడూరులో పనిచేశారు. రాత్రిపూట హిందీ పాఠాలు బోధిస్తూ రాజకీయ తరగతులు నిర్వహించేవారు. 1944లో ఉద్యోగం వదిలి పూర్తి కాలం పార్టీకి అంకితమయ్యారు. రాయలసీమకు కృష్ణాజలాల మళ్లింపునకు ఆందోళన చేపట్టారు. బ్రిటిష్‌వారి అణచివేత ధోరణి పెరగడంతో 1964-66 వరకు రహస్య జీవితం గడిపారు. 1968లో నక్సల్‌బరి పిలుపుతో విప్లవ పార్టీవైపు అడుగులేశారు. ఆదర్శ వివాహం చేసుకుని పిల్లలకూ ఆదర్శ వివాహాలు చేసి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. తన ఆస్తిని అమ్మి పార్టీకి నిధులు అందజేశారు. నీతి, నిజాయతీతో జీవితాన్ని త్యాగం చేసిన పొన్నతోట 1924లో అంకాళమ్మగూడూరులో జన్మించి 1990లో కన్నుమూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని