logo

ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ప్రకటన ఎప్పుడో?

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

Updated : 14 Aug 2022 06:52 IST

విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులు


ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ ప్రధాన ముఖద్వారం

వేంపల్లె, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై కులపతి ఆచార్య కె.చెంచురెడ్డి మాట్లాడుతూ ‘త్వరలోనే ప్రవేశాల ప్రకటన జారీ చేస్తాం. 2008, 2009, 2010లలో రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి పదోతరగతి టాపర్లతో సంబంధం లేకుండా కనీసం ఒక్క విద్యార్థికైనా సీట్లు ఇచ్చాం. ఈ విషయమై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించడంతో పక్కన పెట్టాం. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించి పాత విధానంలోనే మండలానికి ఒక్కరికి ట్రిపుల్‌ఐటీ సీటు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ విషయమై వర్సిటీ యాక్టును సవరించి దానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను తమ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి పంపాం. మరోవైపు తెలంగాణ పదోతరగతి ఫలితాలు, సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాలు, ఏపీ పదోతరగతి ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్ష ఫలితాల జాప్యంతో ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ప్రకటన ఆలస్యమైంది. ఈ ఏడాది ప్రవేశాల కోసం టాపర్లు, వెనుకబాటు సూచి కింద జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థుల వివరాలు అందించాలని విద్యాశాఖను కోరాం. జాబితా అందినవెంటనే ట్రిపుల్‌ఐటీల ప్రవేశాల ప్రకటనను జారీ చేస్తాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని