logo

నిబంధనలు ఉల్లంఘిస్తే లీజు రద్దు

ఇసుక రేవుల్లో నిబంధనల మేరకు తవ్వకాలు, రవాణా చేపట్టాలని, లేనిపక్షంలో లీజు రద్దు చేస్తామని పెండ్లిమర్రి తహసీల్దారు ఉదయ భాస్కరరాజు హెచ్చరించారు. ‘ఈనాడు’లో శనివారం ‘ఇసుక తోడేస్తున్నారు!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించారు.

Published : 25 Sep 2022 03:41 IST

పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డిపల్లె ఇసుక రేవును

తనిఖీ చేస్తున్న తహసీల్దార్‌ ఉదయ భాస్కరరాజు, సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, కడప: ఇసుక రేవుల్లో నిబంధనల మేరకు తవ్వకాలు, రవాణా చేపట్టాలని, లేనిపక్షంలో లీజు రద్దు చేస్తామని పెండ్లిమర్రి తహసీల్దారు ఉదయ భాస్కరరాజు హెచ్చరించారు. ‘ఈనాడు’లో శనివారం ‘ఇసుక తోడేస్తున్నారు!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించారు. సిబ్బందితో కలిసి పాపఘ్ని నదిలోని కొత్త గంగిరెడ్డిపల్లె ఇసుకరేవును పరిశీలించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. అనుమతులు పొందిన మేరకు నిబంధనలకు లోబడి తవ్వకాలు జరపాలని, వేబిల్లులు పారదర్శకంగా జారీ చేయాలని ఆదేశించారు. నిత్యం నిఘా ఉంటుందని, అక్రమాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని