logo

సంప్రదాయ కళలకు పుట్టినిల్లు కడప

సంప్రదాయ కళలకు పుట్టినిల్లుగా పేరొందిన కడప సాంస్కృతిక కళా వైభవాన్ని నలుదిక్కులా విస్తరింపజేస్తామని వైయస్‌ఆర్‌ కలెక్టర్‌ విజయరామరాజు అన్నారు. దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కడప నగరంలోని కళాక్షేత్రంలో తొమ్మిది రోజులపాటు

Published : 25 Sep 2022 03:41 IST

సురభి నాటకప్రదర్శనలు ప్రారంభించిన వైయస్‌ఆర్‌ కలెక్టర్‌


ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు

మారుతీనగర్‌ (కడప), న్యూస్‌టుడే : సంప్రదాయ కళలకు పుట్టినిల్లుగా పేరొందిన కడప సాంస్కృతిక కళా వైభవాన్ని నలుదిక్కులా విస్తరింపజేస్తామని వైయస్‌ఆర్‌ కలెక్టర్‌ విజయరామరాజు అన్నారు. దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కడప నగరంలోని కళాక్షేత్రంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించే సురభి నాటకాలను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చే భారతీయ సంస్కృతి, కళాసంపదను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎందరో మహానుభావులు కడప గడ్డపై పుట్టి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించారని, వారి అడుగుజాడల్లో నేటితరం కళాకారులు, కళాభిమానులు నడవాలని ఆకాంక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు అపూర్వ కానుకగా సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డీసీఎఫ్‌వో బీవీఎస్‌ రాంప్రకాష్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర్‌రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి బ్రహ్మయ్య, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

మాయాబజార్‌ నాటకంలోని ఓ సన్నివేశం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని