logo

షరతుల్లేకుండా పథకాలు అమలు చేయాలని ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న కల్యాణకానుక, షాదీతోఫాకు ఎలాంటి షరతుల్లేకుండా 2019 నుంచి అమలు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్‌, ఏఐసీసీ సభ్యుడు బండి జక్కరయ్య,

Published : 25 Sep 2022 03:41 IST

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న కల్యాణకానుక, షాదీతోఫాకు ఎలాంటి షరతుల్లేకుండా 2019 నుంచి అమలు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్‌, ఏఐసీసీ సభ్యుడు బండి జక్కరయ్య, జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేసేలా ఎన్నికలకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే కల్యాణకానుక, షాదీతోఫాలను కొత్త నిబంధనలతో తీసుకొచ్చారని విమర్శించారు. రేషన్‌కార్డు ఉన్నవారందరికీ పథకాలు అమలు చేయాలని, లేదంటే ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ తిరుమలేష్‌, మహిళా అధ్యక్షురాలు శ్యామల, ఎంఆర్‌ఎఫ్‌ అధ్యక్షుడు దస్తగిరి, మాజీ కార్పొరేటరు రహ్మతుల్లాఖాన్‌, జనసేన నగర అధ్యక్షుడు గౌస్‌బాషా, లోక్‌సత్తా నాయకుడు శ్రీకృష్ణ, ఇన్సాఫ్‌ నగర కార్యదర్శి మైనుద్ధీన్‌, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని