logo

కొడుకు చదువు మానేశాడని తల్లి బలవన్మరణం

కొడుకు బాగా చదివి ప్రయోజకుడవుతాడని కలలు కన్న ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. దీంతో మనస్తాపానికి గురై తాను చనిపోతానని బెదిరిస్తేనైనా మాట వింటాడేమోనని పురుగుల మందు తాగిన

Published : 25 Sep 2022 03:41 IST

రాజుపాళెం, న్యూస్‌టుడే: కొడుకు బాగా చదివి ప్రయోజకుడవుతాడని కలలు కన్న ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. దీంతో మనస్తాపానికి గురై తాను చనిపోతానని బెదిరిస్తేనైనా మాట వింటాడేమోనని పురుగుల మందు తాగిన ఆ తల్లి తనువు చాలించిన ఘటన రాజుపాళెం మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌.ఐ. కృష్ణంరాజు నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం... రాజుపాళెం మండలం కొర్రపాడుకు చెందిన లక్ష్మీనారాయణ, చింతాదేవి (36) దంపతులది రైతు కుటుంబం. వీరికి కుమారుడు (16) కుమార్తె (9) ఉన్నారు. కుమారుడు పదోతరగతి ఉత్తీర్ణత సాధించడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఇటీవల చదువు మధ్యలో ఆపేసి ఇంటికొచ్చేశాడు. తిరిగి కళాశాలకు వెళ్లామని తల్లి ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. ఇలాగే ఉంటే కొడుకు జీవితం నాశనమవుతుందని భావించిన ఆ తల్లి తాను పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరిస్తే మాట వింటాడేమోననుకుని శనివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగానని మీ నాన్నకు చెప్పమని అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ప్రొద్దుటూరులోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌.ఐ. తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని