logo

జగనన్న గోరుముద్ద తిని 15 మంది విద్యార్థులకు అస్వస్థత

చక్రాయపేట మండలం బురుజుపల్లె ప్రాథమిక పాఠశాలలో జగనన్న గోరుముద్ద తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Updated : 27 Nov 2022 04:11 IST

ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం విద్యార్థులను తీసుకెళ్తున్న ఎంఈవో రవీంద్రనాయక్‌, ఉపాధ్యాయులు

చక్రాయపేట, న్యూస్‌టుడే : చక్రాయపేట మండలం బురుజుపల్లె ప్రాథమిక పాఠశాలలో జగనన్న గోరుముద్ద తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 45 మంది విద్యార్థులుండగా శనివారం మధ్యాహ్నం మెనూ ప్రకారం కరివేపాకు రైస్‌ చేయగా 44 మంది విద్యార్థులు తిన్నారు. వీరిలో 15 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు కడుపునొప్పి, మరికొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణారెడ్డి వెంటనే స్పందించి సురభి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. ఆహార పదార్థాలు నాణ్యంగా లేక పోవడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయమై ఎంఈవో రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ పిల్లులు అనారోగ్యానికి గురైంది వాస్తవమేనని, ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం కుదుటపడడంతో తల్లిదండ్రులకు అప్పజెప్పామన్నారు. విషయం తెలిసి జడ్పీటీసీ సభ్యుడు శివప్రసాద్‌రెడ్డి, అధికారులు విద్యార్థులను పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని