logo

ప్రయాణికుల భద్రతే ధ్యేయం

ప్రయాణికుల భద్రతే ధ్యేయమని, వారికి భద్రత కల్పించే విషయంలో రాజీపడబోమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు.

Published : 30 Nov 2022 04:09 IST

దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

కడప రైలు నిలయాన్ని పరిశీలిస్తున్న దక్షిణ మధ్య రైల్వే
జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, డీఆర్‌ఎం వెంకటరామిరెడ్డి, అధికారులు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : ప్రయాణికుల భద్రతే ధ్యేయమని, వారికి భద్రత కల్పించే విషయంలో రాజీపడబోమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం గుత్తి నుంచి రేణిగుంట వరకు పలు రైలునిలయాలను తనిఖీ చేశారు. కడప రైలునిలయానికి చేరుకున్న ఆయన ముందుగా రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అక్కడి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చేవారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారని డివిజనల్‌ మెడికల్‌ అధికారి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన విషయాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నామన్నారు. రైల్వేపరంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో బృందంతో చర్చిస్తున్నామన్నారు. రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ గేట్లు, రైలునిలయాలు, వంతెనలను పరిశీలించినట్లు చెప్పారు. పలుచోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఆయనవెంట డీఆర్‌ఎం వెంకటరామిరెడ్డి, పీసీఓఎం ధనుంజనేయులు, పీసీసీఎం జాన్‌ ప్రసాద్‌, పీసీఎస్‌టీఈ ద్వివేది, సీఎస్‌ఓ రవీంద్రనాథరెడ్డి, కడప రైలునిలయం మేనేజరు డి.ఎన్‌.రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టరు రమేష్‌రెడ్డి, రైల్వే చీఫ్‌ టిక్కెట్‌ ఇన్‌స్పెక్టరు ఉమర్‌బాషా, చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసరు యానాదయ్య తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని