logo

సీమను మోసం చేసిన వైకాపా : తులసిరెడ్డి

హైకోర్టు విషయంలో వైకాపా ప్రభుత్వం రాయలసీమకు తీరని మోసం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ తులసిరెడ్డి ఆరోపించారు.

Published : 30 Nov 2022 02:45 IST

వేంపల్లె, న్యూస్‌టుడే : హైకోర్టు విషయంలో వైకాపా ప్రభుత్వం రాయలసీమకు తీరని మోసం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ తులసిరెడ్డి ఆరోపించారు. మంగళవారం వేంపల్లెలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైకోర్టు విషయంలో జగన్‌పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌, ఆ పార్టీ నాయకులు పదేపదే ప్రకటించారన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాది ఇందుకు పూర్తి విరుద్ధంగా చెప్పారన్నారు. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, న్యాయమూర్తులు, సిబ్బందికి అమరావతిలోనే ప్రభుత్వం నివాస వసతిగృహాలు ఏర్పాటు చేసిందని చెప్పారన్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే అంశం ముగిసిన అధ్యాయమని సుప్రీంకోర్టులో చెప్పారని, ఎందుకింత మోసమని తులసిరెడ్డి ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని