logo

పశువుల మేతకు వెళ్లి మహిళా రైతు మృతి

పశువుల మేత కోసం గడ్డి కోస్తున్న సమయంలో గుండెపోటుతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం గూడెంచెరువులో చోటుచేసుకుంది.

Published : 30 Nov 2022 04:09 IST

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: పశువుల మేత కోసం గడ్డి కోస్తున్న సమయంలో గుండెపోటుతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం గూడెంచెరువులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు... గూడెంచెరువు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (40) మంగళవారం ఉదయం తన ఇంటి సమీపంలో ఉన్న స్థలంలో పశువుల మేతకు గడ్డి కోస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త ఏడాది క్రితం చనిపోయినప్పటి నుంచి ఈమె గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఈమెకు ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని