logo

త్వరితగతిన రుణాల మంజూరు

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో త్వరితగతిన రుణాలు మంజూరు చేయడానికి సరళ రుణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీజీబీ ఛైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌ అన్నారు.

Published : 01 Dec 2022 05:31 IST

ఏపీజీబీ ఛైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌

సరళ రుణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏపీజీబీ ఛైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌, రీజనల్‌ మేనేజరు శ్రీదేవి, తదితరులు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో త్వరితగతిన రుణాలు మంజూరు చేయడానికి సరళ రుణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీజీబీ ఛైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌ అన్నారు. ఏపీజీబీ కాగితాలపెంట శాఖలో సరళ రుణ కేంద్రాన్ని రీజనల్‌ మేనేజరు శ్రీదేవితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీజీబీ ఛైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌ మాట్లాడుతూ రిటైల్‌ రుణ మహోత్సవంలో భాగంగా గృహ, వాహన, వ్యక్తిగత, విద్య, ఆస్తి తనఖా రుణాలు తక్కువ వడ్డీతో మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ప్రత్యేక రాయితీ ఉందన్నారు. రిటైల్‌ రుణ మహోత్సవాలు డిసెంబరు 31వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీజీబీ రీజనల్‌ మేనేజరు పి.శ్రీదేవి, సీనియర్‌ మేనేజర్లు చిరంజీవి, గుణప్రసాద్‌, సరళ రుణ కేంద్రం సీనియర్‌ మేనేజరు మహమ్మద్‌ షరీఫ్‌, కడప టౌన్‌ బ్రాంచ్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని