logo

గర్భిణులకు వైద్యుల పర్యవేక్షణ అవసరం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రహాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన కలసపాడు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు.

Updated : 01 Dec 2022 18:03 IST

కలసపాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రహాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన కలసపాడు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. వార్డులు, బెడ్‌షీట్లు సరిగా లేనట్లు గుర్తించారు. వాటిని సక్రమంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రక్తపోటు, మధుమేహం రోగులకు మందులు అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణులపై క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. మంచానికి పరిమితమైన రోగులకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని కోరారు. లెప్రసీ సర్వేను సమర్థంగా నిర్వహిచాలని అన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో ఖాదర్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని