logo

Kadapa: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు

ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి కడప కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.  బాలిక మృతదేహాన్ని కనిపించకుండా చేసినందుకు మరో మూడేళ్లు అదనంగా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

Published : 12 Dec 2022 23:51 IST

కడప క్రైమ్‌: ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి కడప కోర్టు జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2016లో వైఎస్‌ఆర్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఆరేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఓబన్న అనే వ్యక్తి బాలికకు చాక్లెట్‌ ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాలికను హత్య చేసి మృతదేహాన్ని సమీపంలోని జింకలవనం చెరువులో పూడ్చిపెట్టాడు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఓబన్నే హత్యాచారం చేసినట్లు తేలడంతో 2016లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటినుంచి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సుదీర్ఘ వాదనల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సీఎన్‌ మూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. బాలిక మృతదేహాన్ని కనిపించకుండా చేసినందుకు అదనంగా మరో మూడేళ్లు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని