రూ.30 లక్షల విలువైన 130 చరవాణుల స్వాధీనం
గతంలో చరవాణులు పోయినట్లయితే సంబంధిత పోలీసు ఠాణాల్లో ఫిర్యాదు చేసేవారు. ఫిర్యాదు చేసినప్పటికీ చరవాణి దొరుకుతుందనే నమ్మకం ఉండేది కాదు.
9392941541 వాట్సాప్ నంబరు ద్వారా ఫోన్ల రికవరీ
ఎస్పీ అన్బురాజన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న బాధితులు
కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: గతంలో చరవాణులు పోయినట్లయితే సంబంధిత పోలీసు ఠాణాల్లో ఫిర్యాదు చేసేవారు. ఫిర్యాదు చేసినప్పటికీ చరవాణి దొరుకుతుందనే నమ్మకం ఉండేది కాదు. రోజు రోజుకూ చరవాణులు పోగొట్టుకున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక చొరవ చూపి 9392941541 అనే వాట్సాప్ నంబరును అమల్లోకి తీసుకొచ్చి ‘మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానం (ఎంఎంటీఎస్)’ ద్వారా చరవాణులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. కేవలం నెల రోజుల్లో రూ.30 లక్షల విలువ చేసే 130 చరవాణులు స్వాధీనపరచుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 1682 ఫిర్యాదులు రాగా, ఎంఎంటీఎస్ ద్వారా 409 చరవాణులు గుర్తించి, వాటిల్లో 130 చరవాణులను స్వాధీనపరచుకున్నామన్నారు. చరవాణులు పోగొట్టుకుంటే ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా పోగొట్టుకున్న బాధితునికి చరవాణి అందజేయాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబరు 1న ఎంఎంటీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. కేవలం నెల రోజుల్లో 130 చరవాణులు స్వాధీనపరచుకున్నామని తెలిపారు. సెకండ్ హ్యాండ్ చరవాణులు కొనేవారు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. చరవాణుల రికవరీలో కృషి చేసిన సైబర్ సీఐ శ్రీధర్‌నాయుడు వారి బృందానికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. బాధితులందరూ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు తుషార్ డూడి, ప్రేరణకుమార్, డీఎస్పీ చెంచుబాబు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!