వీడియో అప్‌లోడ్ చేస్తే డబ్బులొస్తాయని నమ్మి.. మోసపోయిన ఇంజినీరింగ్ విద్యార్థిని
పోరుమామిళ్ల పట్టణానికి చెందిన బీటెక్ చదివిన ఓ విద్యార్థిని యూట్యూబ్‌లో సబ్‌స్రైబ్ చేస్తే డబ్బులొస్తాయని నమ్మి రూ.14,75,000 పోగొట్టుకున్నారు.
రూ.14.75 లక్షలు పోగొట్టుకున్న వైనం
పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన బీటెక్ చదివిన ఓ విద్యార్థిని యూట్యూబ్‌లో సబ్‌స్రైబ్ చేస్తే డబ్బులొస్తాయని నమ్మి రూ.14,75,000 పోగొట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.ఐ.హరిప్రసాదు తెలిపారు. వీడియోతీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే డబ్బులొస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. బీటెక్ పట్టభద్రురాలు ఆసక్తిగా అప్‌లోడ్ చేయడంతో మొదటి రోజు రూ.2 వేలు, రూ.3 వేలు వచ్చాయి.
అనంతరం ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని వారు నమ్మించారు. వచ్చిన డబ్బులకు పన్నులు కట్టాలని వారు చెప్పడంతో వారం రోజుల్లో రూ.14,75,000 సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలకు ఆమె జమ చేశారు. చేతిలో డబ్బులు లేకున్నా బ్యాంకులో రూ. 2 లక్షల రుణం తీసుకొని వారు చెప్పిన ఖాతాలకు నగదు జమ చేశారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీలోపు ఈ ఆర్థిక లావాదేవీలు చేసి మోసపోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!