logo

పాఠశాలల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ఉపాధ్యాయులు చరవాణులలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌, కడప ఆర్జేడీ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 29 Jan 2023 04:01 IST

మాట్లాడుతున్న ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి, వేదికపై అధికారులు

కడప విద్య, న్యూస్‌టుడే : ఉపాధ్యాయులు చరవాణులలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌, కడప ఆర్జేడీ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించినా, కొట్టినా, జవాబు పత్రాలు దిద్దకపోయినా, వర్క్‌బుక్కులు వినియోగంలో లేకపోయినా చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంఈఓలు, హెచ్‌.ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ పదోతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఎస్‌సీఈఆర్‌టీ మాదిరి ప్రశ్నపత్రాలను పంపిణీ చేస్తుందని, డి గ్రేడ్‌ విద్యార్థులతో వాటిని చదివించాలని ఆదేశించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు విద్యార్థులు ఇళ్ల వద్ద చదివేలా చూడాలని, ఇందుకు ప్రధానోపాధ్యాయులంతా నైట్‌విజన్‌ చేయాలన్నారు. విద్యార్థులను బాగా చదివించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఉండాలని, ఎంఈఓ, 15 రోజులకు ఒకసారి మహిళా కానిస్టేబుల్‌, ఆరోగ్య కార్యకర్తతో కలిసి ఫిర్యాదులను పరిశీలించాలన్నారు. వారానికి ఒకసారి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తినాలన్నారు. సమావేశంలో డీఈఓ దేవరాజు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, కడప డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి శోభారాణి, పరీక్షల విభాగం అధికారి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని