logo

వైభవంగా కడప రాయుడి రథోత్సవం

తిరుమల తొలిగడప దేవుని కడప ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. వేడుకల్లో శనివారం రథసప్తమి సందర్భంగా రథోత్సవం నిర్వహించారు.

Published : 29 Jan 2023 04:01 IST

రథంపై కొలువుదీరిన  శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి

మారుతీనగర్‌ (కడప), న్యూస్‌టుడే: తిరుమల తొలిగడప దేవుని కడప ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. వేడుకల్లో శనివారం రథసప్తమి సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువుదీరిన కడప రాయుడు రథాన్ని ఆలయ మాడవీధుల్లో తిప్పారు. రథం లాగడానికి భక్తులు పోటీపడ్డారు. స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. జిల్లా నలు మూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

భక్తులు, కళాకారుల కోలాటం

దేవుని కడప మాడవీధుల్లో రథాన్ని ఊరేగిస్తున్న భక్తులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని