logo

కలం వీరులు... కర్తవ్య శూరులు

పోలీసు, మిలటరీ తరహాలో సమాజ శ్రేయస్సు కోసం అసువులు బాసిన కలం వీరులైన పాత్రికేయులను సమాజం సదా స్మరించుకోవాలని కడప యోగి వేమన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 04:01 IST

యోవేవి పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి

మాట్లాడుతున్న యోగి వేమన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: పోలీసు, మిలటరీ తరహాలో సమాజ శ్రేయస్సు కోసం అసువులు బాసిన కలం వీరులైన పాత్రికేయులను సమాజం సదా స్మరించుకోవాలని కడప యోగి వేమన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘భారత స్వాతంత్రోద్యమంలో తెలుగు పత్రికలు- జర్నలిజం’ అన్న అంశంపై పీలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన రెండు రోజుల జాతీయ సెమినార్‌ శనివారం ముగిసింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఏటా 900 మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోవడంగాని, కనిపించకుండా పోవడం గాని జరుగుతోందన్నారు. అసాంఘిక శక్తుల చేతుల్లో భౌతిక దాడులకు గురవుతున్న వారు వేళల్లో ఉండగా.. మానసిక వేధింపులకు గురవుతున్న వారు లెక్కకు మించి ఉన్నారని చెప్పారు. సమాజ శ్రేయస్సుకు వ్యక్తిగత శ్రేయస్సును వదిలి నిత్యం ఉరుకుల, పరుగుల జీవితంతో పాలకుల వేధింపులు, అధికారుల ఈసడింపులు, తోటి వారి హేళనలను లెక్కచేయక తమ లక్ష్యం పక్కదారి పట్టకుండా నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలన్నారు. తెలుగు అధ్యాపకురాలు నీరజ మాట్లాడుతూ.. సతీహిత బోధ, హిందూ సుందరి, అనసూయ, సావిత్రిలాంటి స్త్రీల పేరుతో వచ్చిన తెలుగు పత్రికలు స్వాతంత్ర ఉద్యమంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా భాగస్వాములు కావడానికి ఎంతో దోహదపడ్డాయన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాశ్చ పరిశోధన సంస్థ ఆచార్యులు బీసీ వెంకటేశ్వర్లు, సదస్సు సమన్వయకర్త డాక్టర్‌ కరణం శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. సదస్సుకు హాజరైన వక్తలు అధ్యాపకులు, రీసెర్చి స్కాలర్లను ఘనంగా సన్మానించారు. డాక్టర్‌ వాసు, డాక్టర్‌ ఈశ్వర్‌బాబు, డాక్టర్‌ యువశ్రీ, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి, పరిశోధక విద్యార్థులు, వేద కళాశాలల అధ్యాపకులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు