logo

పోలీసులకు గురి ముఖ్యం

పోలీసులకు గురి చాలా ముఖ్యమని ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య అన్నారు. మొబిలైజేషన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం కడప శివారులోని రాజీవ్‌ స్మృతివనంలో ఏఆర్‌ పోలీసులకు ఫైరింగ్‌లో మెలకువలు నేర్పించారు.

Published : 29 Jan 2023 04:01 IST

ఫైరింగ్‌లో మెలకువలు నేర్చుకుంటున్న పోలీసులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీసులకు గురి చాలా ముఖ్యమని ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య అన్నారు. మొబిలైజేషన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం కడప శివారులోని రాజీవ్‌ స్మృతివనంలో ఏఆర్‌ పోలీసులకు ఫైరింగ్‌లో మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికొకసారి నిర్వహించే పునశ్చరణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీసులు మరిచిపోయిన అంశాలను తిరిగి వివరిస్తారని చెప్పారు. తుపాకీ నిర్వహణ, ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా గురి పెట్టాలి అనే అంశాలపై మెలకువలు నేర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సోమశేఖర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని