logo

అంతర్‌ జిల్లాల ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

ఎర్రగుంట్లలోని జడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో శనివారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఏపీ అంతర్‌ జిల్లాల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 520 మంది క్రీడాకారులు, 30 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారు

Published : 29 Jan 2023 04:01 IST

ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఈవో దేవరాజు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: ఎర్రగుంట్లలోని జడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో శనివారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఏపీ అంతర్‌ జిల్లాల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 520 మంది క్రీడాకారులు, 30 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో దేవరాజు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త తుపాకుల పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శి అరుణకుమారి, పరిశీలకులు ప్రభాకర్‌, తిరుపాల్‌రెడ్డి, జిలానీబాషా తదితరులు పాల్గొన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని