logo

విద్యుత్తు తీగలు తొలగించేదెన్నడో?

సర్వే సంఖ్య 627లో 2.26 ఎకరాల్లో 54 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. సర్వే నంబరు 4151లో 0.65 ఎకరాల్లో 22 మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన పత్రాలు అందజేశారు.

Published : 29 Jan 2023 04:01 IST

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట: సర్వే సంఖ్య 627లో 2.26 ఎకరాల్లో 54 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. సర్వే నంబరు 4151లో 0.65 ఎకరాల్లో 22 మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన పత్రాలు అందజేశారు. పక్కాగృహాలు మంజూరు చేశారు. కాలనీ మధ్యలో 33 కేవీ విద్యుత్తు తీగలు ఉన్నాయి. ఆరు స్తంభాలను 300 మీటర్ల తీగలను మార్పు చేయాల్సి ఉంది. రహదారి పక్కనే స్తంభాలను ఏర్పాటు చేశారు. విద్యుత్తు తీగలను మార్పుచేయలేదు. నివాస గృహాలకు అతి సమీపంలో కరెంటు తీగలు ఉండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సమస్యపై ఏఈ ఉదయ్‌కుమార్‌ను వివరణ కోరగా త్వరలో మార్పు చేస్తామని చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు