logo

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో ఓ వ్యక్తి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కడప రామాంజనేయపురానికి చెందిన షేక్‌ పీరుల్లా (35) ఈ నెల 24న ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు.

Updated : 29 Jan 2023 04:57 IST

షేక్‌ పీరుల్లా (పాత చిత్రం)

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో ఓ వ్యక్తి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కడప రామాంజనేయపురానికి చెందిన షేక్‌ పీరుల్లా (35) ఈ నెల 24న ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు అతనికోసం గాలిస్తున్నారు. దేవునికడప సమీప పొలాల్లో ఉన్న ఓ బావిలో షేక్‌ పీరుల్లా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారాన్ని చేరవేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.


అనారోగ్యంతో మహిళ

చింతకొమ్మదిన్నె : మండల పరిధి బుగ్గవంక ప్రాజెక్టు సమీపంలోని తురకపల్లెకు చెందిన మాయ (25) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అరణ్‌రెడ్డి తెలిపారు. కడప నగరానికి చెందిన సయ్యద్‌ మౌలాలి ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. అక్కడ నేపాల్‌ దేశానికి చెందిన మాయ పరిచయమైంది. అయిదేళ్ల కిందట ఇద్దరూ కువైట్‌ నుంచి కడపకు వచ్చి వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తురకపల్లెలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొన్నాళ్ల నుంచి మాయ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుంది. భర్త మౌలాలి, కుటుంబ సభ్యులు గుర్తించి కడప నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. భర్త మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని