logo

అక్కడ ఇద్దరు... ఇక్కడ ఇద్దరు!

స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగితే పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్‌ సైతం ఓడిపోతారని ఏపీసీసీ మీడియా ఛైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు.

Published : 31 Jan 2023 02:43 IST

డీఆర్సీకి చివరలో కమలాపురం ఎమ్మెల్యే హాజరు
ఈనాడు డిజిటల్‌, కడప

ఉదయం 11 గంటలకు పూర్తిస్థాయిలో సభ్యుల్లేక వెలవెలబోయిన

జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం

ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించే డీఆర్సీ, జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలకు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టడం విమర్శలకు దారి తీస్తోంది. కడపలో సోమవారం రెండు సమావేశాలు జరిగాయి. ఉదయం 9 గంటలకు జడ్పీ సమావేశాన్ని ప్రారంభిస్తామంటూ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఉదయం 11 గంటలైనా సమావేశం ప్రారంభం కాలేదు. సభ్యులు హాజరు తక్కువగా ఉన్నందున కోరం లేదంటూ వేచిచూశారు. ఉమ్మడి కడప జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశానికి ముగ్గురు ఎంపీలు, పది మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు హాజరుకావాల్సి ఉంది. ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మినహాయిస్తే మిగిలిన 9 మంది హాజరు కావాల్సి ఉండగా... ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, బద్వేలు, రాయచోటి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సుధ, శ్రీకాంత్‌రెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డి, సీఎం రమేశ్‌ హాజరుకాలేదు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల్లో సైతం చాలా మంది గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే సుధ, కొందరు జడ్పీటీసీసభ్యులు, ఎంపీపీలు మినహా చాలా మంది మౌనం పాటించారు. ఇక డీఆర్సీ సమావేశానికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హాజరు కాగా, ముగింపు సమయంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వచ్చారు. ఈయనకు మాట్లాడే అవకాశం లభించలేదు. అజెండా ప్రకారం శాఖల వారీగా లెక్కలు చెప్పడం మినహా ఇతరత్రా పెద్దగా చర్చ సాగిన దాఖలాల్లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు