logo

గండికోటలో భారతీయుడు-2 సందడి

సినీ కథానాయకుడు కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌ కలయికలో భారతీయుడుకు కొనసాగింపుగా రూపొందుతున్న భారతీయుడు-2 చిత్రీకరణ గండికోటలో శరవేగంగా జరుగుతోంది.

Published : 31 Jan 2023 02:43 IST

ప్రత్యేక హెలీకాప్టర్‌లో గండికోటకు కమల్‌హాసన్‌ రాక

ప్రత్యేక హెలీకాప్టర్‌లో గండికోటకు చేరుకున్న కమల్‌హాసన్‌

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: సినీ కథానాయకుడు కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌ కలయికలో భారతీయుడుకు కొనసాగింపుగా రూపొందుతున్న భారతీయుడు-2 చిత్రీకరణ గండికోటలో శరవేగంగా జరుగుతోంది. కోట ముఖద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సెట్టింగ్‌లో బ్రిటీషు కాలంలో కూరగాయల, పశువుల కొనుగోలు ప్రాంతంలో ప్రజలపై పోలీసులు దాడి చేస్తుంటే కమల్‌హాసన్‌ అక్కడి చేరుకుని వారిపై తిరుగుబాటు చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సుమారు ఫిబ్రవరి 4వ తేదీ వరకు గండికోట పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఆ మేరకు కమల్‌హాసన్‌ను ప్రత్యేక హెలీకాప్టర్‌లో తిరుపతి నుంచి గండికోటకు చేరుకునేలా చిత్రబృందం ఏర్పాట్లు చేసుకుంది. శంకర్‌ ప్రస్తుతం ఇటు కమల్‌హాసన్‌తోనూ, అటు రామ్‌చరణ్‌తోనూ సమాంతరంగా రెండు సినిమాల్ని చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు