logo

అర్హులందరికీ జగనన్న చేదోడు

జిల్లాలో జగనన్న చేదోడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 16,577 మంది నాయీ బ్రాహ్మణ, రజక, దర్జీ కుటుంబాలకు రూ.16.57 కోట్లు విడుదల చేసిందని డీఆర్వో గంగాధర్‌గౌడ్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 02:43 IST

లబ్ధిదారులకు జగనన్న చేదోడు చెక్కు అందజేస్తున్న డీఆర్వో

గంగాధర్‌గౌడ్‌, అధికారులు, నాయకులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే : జిల్లాలో జగనన్న చేదోడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 16,577 మంది నాయీ బ్రాహ్మణ, రజక, దర్జీ కుటుంబాలకు రూ.16.57 కోట్లు విడుదల చేసిందని డీఆర్వో గంగాధర్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వో, బీసీ కార్పొరేషన్‌ ఈడీ, పలువురు అధికారులు జగనన్న చేదోడు చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. డీఆర్వో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి రుణాలు అందుతున్నాయన్నారు. అర్హత ఉండి పథకం అందని వారు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. బీసీ కార్పొరేషన్‌ ఈడీ బ్రహ్మయ్య, రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ రమణమ్మ, హజ్‌ కమిటీ ఛైర్మన్‌ గౌస్‌లాజమ్‌, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు నాగలక్ష్మీ, ఉమామహేశ్వరి, మురళీధర్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు