logo

యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుంది

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 31 Jan 2023 02:43 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

లోకేశ్‌తో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

కలికిరి, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో సోమవారం నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి, కలికిరి, పీలేరు మండలాల నుంచి భారీ సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు