logo

గ్యాస్‌ ఏజెన్సీ పేరిట మోసం

అపరిచిత వ్యక్తుల చేతిలో మోసపోయి నగదు పోగొట్టుకున్న ఘటన చిన్నమండెం మండలంలో చోటుచేసుకుంంది. ఎస్‌.ఐ. రమేష్‌బాబు సోమవారం కేసు వివరాలు వెల్లడించారు.

Published : 31 Jan 2023 02:43 IST

రూ.5.44 లక్షలు పోగొట్టుకొన్న యువకుడు

చిన్నమండెం, న్యూస్‌టుడే: అపరిచిత వ్యక్తుల చేతిలో మోసపోయి నగదు పోగొట్టుకున్న ఘటన చిన్నమండెం మండలంలో చోటుచేసుకుంంది. ఎస్‌.ఐ. రమేష్‌బాబు సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. చిన్నమండెంకు చెందిన ఓ యువకుడు ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడన్నారు. తనకున్న అయిదెకరాల స్థలంలో గ్యాస్‌ ఏజెన్సీ పెట్టాలని నిర్ణయించుకుని ఆన్‌లైన్‌లో వెతికి అందులో ఓ గ్యాస్‌ ఏజెన్సీ పేరుతో ఒక లింకు కనిపించడంతో దానిపై క్లిక్‌ చేసి ఫోన్‌ నంబరు పంపాడన్నారు. కంపెనీ ప్రతినిధులమంటూ కొందరు ఫోన్‌ చేసి ఏజెన్సీ ఇస్తామని, తాము చెప్పినట్లు చేయడంతో పాటు నగదు పంపితే ఏజెన్సీ కేటాయిస్తామని నమ్మబలికారన్నారు. వారు చెప్పిన విధంగానే గతేడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.5.44 లక్షలు పంపినట్లు బాధితుడు పంపినట్లు వివరించారు. అనంతరం కంపెనీ పేరుతో చేసిన ఫోన్‌ నంబరు స్విచ్‌ ఆఫ్‌ కావడంతో మోసపోయినట్లు గ్రహించి సోమవారం తమకు ఫిర్యాదు చేశాడన్నారు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌.ఐ. తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని