logo

ప్రాణం తీసిన రూ.200

రాజంపేట మండలం వెంకటరాజంపేట వద్ద ఈ నెల 24వ తేదీన జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు.

Updated : 31 Jan 2023 06:37 IST

మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి,

పక్కన సీఐ పుల్లయ్య, ఎస్‌.ఐ. భక్తవత్సలం

రాజంపేట గ్రామీణ న్యూస్‌టుడే: రాజంపేట మండలం వెంకటరాజంపేట వద్ద ఈ నెల 24వ తేదీన జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు. మన్నూరు పోలీసుస్టేషన్‌లో సోమవారం ఆయన సీఐ పుల్లయ్య, ఎస్‌.ఐ.భక్తవత్సలంతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. కడప నగరానికి చెందిన ఓ మహిళ (45) పడుపు వృత్తిని కొనసాగిస్తుండగా, కర్ణాటక రాష్ట్రం కోరుడకేరాకు చెందిన మంజునాథ గురివిస్‌ (35) గత 12 ఏళ్లుగా లారీచోదకుడిగా పనిచేస్తున్నాడన్నారు. ఈ నెల 21న కర్ణాటక నుంచి శ్రీకాళహస్తికి ఐరన్‌ లోడు రవాణా చేస్తూ 24వ తేదీ తెల్లవారుజామున వెంకటరాజంపేట పెట్రోలుబంకు సమీపంలోకి రాగానే లారీకి ఆమె టార్చిలైటు వేయడంతో లారీ నిలిపి ఆమె వద్దకు వెళ్లారు. వీరి మధ్య రూ.300కు ఒప్పందం కుదిరిందన్నారు. ఆమెకు రూ.500 ఇచ్చి రూ.200 తిరిగివ్వమని అడిగినందుకు డబ్బులివ్వకపోగా, చెంపపై కొట్టడంతో కోపంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు మంజునాథ అంగీకరించాడన్నారు. ఆమె మృతిచెందిన విషయం తెలుసుకుని అక్కడ నుంచి  పరారయ్యాడన్నారు. సాంకేతికత ఆధారంగా అనంతపురం జిల్లా గుంతకల్‌ వద్ద ఈ నెల 29న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసును చేధించిన మన్నూరు పోలీసులకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు రివార్డు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని