logo

22 కేసుల్లో నిందితుడైన దొంగ అరెస్టు

22 కేసుల్లో నిందితుడైన దొంగను సోమవారం అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్‌ సర్కిల్‌ సీఐ శివాంజనేయులు తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

Published : 31 Jan 2023 02:43 IST

రూ.4.10 లక్షల విలువ చేసే 82 గ్రాముల బంగారు నగల స్వాధీనం
మరో నిందితుడి కోసం గాలింపు

వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ సర్కిల్‌ సీఐ శివాంజనేయులు, నిమ్మనపల్లె ఎస్‌.ఐ. ఫాతిమా

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: 22 కేసుల్లో నిందితుడైన దొంగను సోమవారం అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్‌ సర్కిల్‌ సీఐ శివాంజనేయులు తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గతేడాది మూడు గొలుసు దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లె పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లె సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు తమను చూసి పారిపోతుండగా వెంబడించి ఒకరిని పట్టుకున్నామన్నారు. అతన్ని విచారించగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం గంగానగర్‌కు షేక్‌ ముస్లిమ్‌ (33)గా గుర్తించామన్నారు. అతన్ని విచారించగా గొలుసు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడంతో అతని నుంచి రూ.4.10 లక్షలు విలువజేసే 82 గ్రాముల బంగారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు మదనపల్లె నియోజకవర్గంతో పాటు తిరుచనూరు, గాజులమండ్యం, పలమనేరు, గుంతకల్లు, పీలేరు పోలీస్‌స్టేషన్లలో 22 కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇతను గతంలో గొలుసు దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చాడని ఇటీవలే జైలు నుంచి విడుదలై వాల్మీకిపురంలో ఉంటున్నట్లు తెలిసిందన్నారు.అతనితో పాటు వచ్చి పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు