logo

పట్టపగలే చోరీ

దుస్తులు కొనుగోలు చేస్తున్న ఓ మహిళ చేతిసంచిని బ్లేడుతో కోసి అందులో ఉన్న నగలు, నగదు అపహరించిన ఘటన సోమవారం కడపలో చోటుచేసుకుంది.

Published : 31 Jan 2023 02:43 IST

12 తులాల బంగారు నగలు, రూ.7 వేల నగదు అపహరణ

బాధితురాలిని విచారిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : దుస్తులు కొనుగోలు చేస్తున్న ఓ మహిళ చేతిసంచిని బ్లేడుతో కోసి అందులో ఉన్న నగలు, నగదు అపహరించిన ఘటన సోమవారం కడపలో చోటుచేసుకుంది. పెండ్లిమర్రి మండలం మర్రిమాకులపల్లెకు చెందిన మల్లేశ్వరి భర్త చెన్నైలో పనిచేస్తుండడంతో ఆమె అక్కడే ఉంటోంది. సోమవారం చెన్నై నుంచి కడపకు వచ్చారు. పిల్లలకు కొత్త దుస్తులు కొనుగోలు చేయడానికి తండ్రితో కలిసి వైవీస్ట్రీట్‌కు వచ్చారు. ఓ దుకాణంలో దుస్తులు కొనుగోలు చేస్తుండగా చోరులు తెలివిగా ఆమె చేతి బ్యాగును బ్లేడుతో కత్తిరించి అందులో ఉన్న 12 తులాల బంగారు నగలు, రూ. 7 వేల నగదు దొంగలించారు. బ్యాగులో ఉన్న కొన్ని వస్తువులు కింద పడుతుండగా ఆమె గుర్తించి చూడగా నగలు, నగదు కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ పుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు