logo

నెల్లూరు తరహాలో ప్రభుత్వంపై తిరుగుబాటు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై విసుగు చెందిన ప్రజలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తిరుగుబాటు చేసినట్లే అన్ని జిల్లాల్లో వైకాపాపై వ్యతిరేకత పుట్టుకొస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు.

Published : 03 Feb 2023 00:50 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి

పీలేరు సబ్‌జైలు నుంచి విడుదలైన కార్యకర్తలతో
కలసి మాట్లాడుతున్న నల్లారి, చల్లా రామచంద్రారెడ్డి

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై విసుగు చెందిన ప్రజలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తిరుగుబాటు చేసినట్లే అన్ని జిల్లాల్లో వైకాపాపై వ్యతిరేకత పుట్టుకొస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. రొంపిచెర్ల మండలంలో ఫ్లెక్సీల గొడవ కేసులో అరెస్టై పీలేరు జైలులో ఉన్న ఎనిమిది మంది తెదేపా కార్యకర్తలు గురువారం బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఈయనతో పాటు పుంగునూరు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు చల్లా రామచంద్రారెడ్డి జైలు వద్ద విడుదలైన కార్యకర్తలకు స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ... మంత్రి పెద్దిరెడ్డి పుంగునూరు నియోజకవర్గ పరిధిలో 12 మంది ముస్లీంలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారన్నారు. వీరందరూ చేయని తప్పునకు జైలు జీవితం గడపాల్సి రావడం బాధాకరమన్నారు. న్యాయం గెలవడంతో హైకోర్టు బెయిలు మంజూరు చేసిందని వారు అన్నారు. అక్రమ కేసులు పెట్టించి వేధించడాన్ని గమనిస్తున్న అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెదేపా అధికారం చేపట్టబోతోందని, మంత్రి పెద్దిరెడ్డికి వడ్డీతో సహా చెల్లిస్తామని వీరు హెచ్చరించారు. పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి హనీఫ్‌, శ్రీకాంత్‌రెడ్డి, మల్లెల రెడ్డిబాషా, అత్తార్‌ చాన్‌బాషా, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు