logo

‘ప్రభుత్వ భూములు వైకాపా నాయకులకు కట్టబెట్టేందుకే అసైన్‌మెంట్‌ కమిటీలు’

వైకాపా నాయకులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం అసైన్‌మెంట కమిటీలను తెరమీదకు తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Published : 03 Feb 2023 01:08 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, వేదికపై తెదేపా నాయకులు

రాయచోటి, న్యూస్‌టుడే: వైకాపా నాయకులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం అసైన్‌మెంట్‌ కమిటీలను తెరమీదకు తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్‌కు కేటాయించిన భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారిపై కేసు పెట్టామని ప్రకటించారే తప్ప, ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. ఇటీవల మండలాల్లో ప్రభుత్వ భూములను దొంగ డీకేటీ పట్టాలతో వైకాపా నాయకులు ఆన్‌లైన్లు చేయించుకుని ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందు తున్నారన్నారు. ప్రతి మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భూమి లేని నిరుపేదలెందరున్నారో సచివాలయాల్లో ముందుగా జాబితాలను ప్రదర్శించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబ సభ్యుల పేర్లపై భూములున్నాయా లేదా అనే విషయాలను అధికారులు గుర్తించాల్సి ఉందన్నారు. ఉమ్మడి కుటుంబంలోని భూములు చూపకుండా వారి కుటుంబ సభ్యులు నిరుపేదలుగా చూపిస్తూ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భూములకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలను గ్రామసభల్లో ఆమోదించిన తరువాతే అసైన్‌మెంట్‌ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఆయనవెంట తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసారెడ్డి, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలీ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని