లోకేశ్ ప్రచార వాహనం జప్తుపై ఆందోళన
పలమనేరు నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రచార వాహనాన్ని జపు చేస్తే సహించేదిలేదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు దొమ్మలపాటి రమేశ్ హెచ్చరించారు.
నారా లోకేశ్ వాహనాన్ని జప్తు చేసినందుకు నిరసనగా ఆందోళన
చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేశ్, తెదేపా శ్రేణులు
మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : పలమనేరు నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రచార వాహనాన్ని జపు చేస్తే సహించేదిలేదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు దొమ్మలపాటి రమేశ్ హెచ్చరించారు. గురువారం పలమనేరు నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ప్రసంగం అనంతరం వాహనాన్ని జప్తు చేయడానికి పోలీసులు సిద్ధం కావడంతో, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీసులు వాహనాన్ని జప్తు చేయడంలేదని చెప్పడంతో వాహనాన్ని తీసుకెళ్లారు. కార్యక్రమంలో యువ నాయకుడు యశశ్విరాజ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్