logo

జిల్లా పర్యటనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం రాత్రి కడప నగరానికి చేరుకున్నారు.

Published : 03 Feb 2023 01:42 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌ విజయరామరాజు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం రాత్రి కడప నగరానికి చేరుకున్నారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో కడపకు బయలుదేరగా రేణిగుంట విమానాశ్రయంలో కడప కలెక్టర్‌ విజయరామరాజు, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడప నగరానికి చేరుకుని ప్రభుత్వ అతిథిగృహంలో బసచేశారు. శుక్రవారం ఉదయం సింహాద్రిపురం మండలం భానుకోట చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ముద్దనూరు మండలంలోని ఉన్నతపాఠశాలను పరిశీలిస్తారని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని