logo

పుణ్యక్షేత్రాలకు పూర్వ వైభవం

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పుణ్యక్షేత్రాలకు పూర్వవైభవం వస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 04 Feb 2023 05:05 IST

పూజల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి,  ఎంపీ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, తదితరులు

సింహాద్రిపురం, జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పుణ్యక్షేత్రాలకు పూర్వవైభవం వస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సింహాద్రిపురం మండలం అహోబిలాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో పునర్నిర్మించిన భానుకోటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత ప్రాముఖ్యత గల ఆలయాల జీర్ణోద్ధరణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇందుకు తితిదే ఆర్థిక సాయం కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భానుకోట ఆలయానికి అత్యంత ప్రాచీన చరిత్ర ఉందని తితిదే నిధులతో పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భానుకోట సోమేశ్వరస్వామి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పార్వతీ సమేత సోమేశ్వరస్వామి శివలింగ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. అనంతరం చవ్వారిపల్లెలోని రామాలయాన్ని దర్శించుకుని స్వామి ఆశీర్వదాలు పొందారు. అనంతరం స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌, తితిదే జేఈవో వీరబ్రహ్మం, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌నాయక్‌, నగర కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌మీనా, ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటేశు, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ శంకర్‌బాలాజీ, ఈవో విశ్వనాథరెడ్డి, డీఎంహెచ్‌వో నాగరాజు, సర్పంచి మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని