logo

వంతెన కింద జలం... దాటేదెలా జనం?

రైల్వేకోడూరు మండలం రామయ్యపాలెం - బంగ్లామిట్ట గిరిజన కాలనీ మధ్య నాలుగేళ్ల కిందట సుమారు రూ.2 కోట్లతో రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మించారు.

Published : 04 Feb 2023 05:05 IST

నీటితో నిండిన రామయ్యపాలెం రైల్వే అండర్‌బ్రిడ్జి

రైల్వేకోడూరు మండలం రామయ్యపాలెం - బంగ్లామిట్ట గిరిజన కాలనీ మధ్య నాలుగేళ్ల కిందట సుమారు రూ.2 కోట్లతో రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మించారు. ఈ ప్రాంతంలోని పంటపొలాలు, మామిడి తోటలు ఎక్కువగా ఉండడంతో. దిగుబడుల రవాణాకు, ప్రజల రాకపోకలకు అనువుగా దీని నిర్మాణం చేపట్టారు. వంతెన కేవలం వేసవిలో మాత్రమే ఉపయోగపడుతోందని, వర్షాకాలం ఆరంభమైతే వంతెన కింద నుంచి రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్న గుట్టలపై కురిసే వర్షపునీరంతా ఊటగా మారి వంతెన కిందకు చేరుతుండడంతో మూడు నుంచి నాలుగు నెలలపాటు రాకపోకలు స్తంభించిపోతున్నాయని వాపోతున్నారు. వంతెన కింద నుంచి వెళ్లలేక కట్టమీద నుంచి రైలు పట్టాలు దాటుతూ రాకపోకలు సాగించాల్సి వస్తోందని, వాహన రాకపోకలు లేవని వారంతా చెబుతున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

న్యూస్‌టుడే, రైల్వేకోడూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని