logo

పోలీసు సమాచార కేంద్రం పనులు ప్రారంభం

పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో శుక్రవారం పోలీసు సమాచార కేంద్రం పనులు ప్రారంభమయ్యాయి.

Published : 04 Feb 2023 05:05 IST

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో శుక్రవారం పోలీసు సమాచార కేంద్రం పనులు ప్రారంభమయ్యాయి. కొండపై ఉన్న గాలిబండపై రెవెన్యూశాఖ కేటాయించిన భూమిలో ఈ పనులను చేపట్టారు. ఈనాడులో జనవరి 25న ‘హార్సిలీహిల్స్‌ అవుట్‌పోస్టు తెరిచేదెప్పుడు?’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాల్లో పోలీసు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. పర్యాటకులకు భద్రత కల్పించడంతో పాటు వాస్తవ సమాచారాన్ని ఈ కేంద్రాల ద్వారా అందివ్వాలని భావిస్తున్నారు. హార్సిలీహిల్స్‌కు పర్యాటక కేంద్రంగా పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సమాచార కేంద్రాన్ని నిర్మించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లె రూరల్‌ సీఐ శివాంజనేయులు, స్థానిక ఎస్‌ఐ రామమోహన్‌లు భూమిపూజతో పనులకు శ్రీకారం చుట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు