logo

సకాలంలో సేవలందించకుంటే పరిహారం చెల్లిస్తాం

విద్యుత్తు సేవలు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందని ఏపీ ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ సుబ్బరాజు అన్నారు.

Published : 05 Feb 2023 02:22 IST

ఏపీ ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు

అధికారులతో సమీక్షిస్తున్న ఏపీ ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ సుబ్బరాజు

మైదుకూరు, న్యూస్‌టుడే : విద్యుత్తు సేవలు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందని ఏపీ ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ సుబ్బరాజు అన్నారు. సకాలంలో సేవలు అందించి ప్రజల మెప్పు పొందాలని సూచించారు. శనివారం స్థానిక విద్యుత్తు ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన డివిజన్‌ పరిధిలోని అధికారులతో సమీక్షించారు.  డీఈఈ వి.రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సుబ్బరాజు మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదుపై వెంటనే స్పందించాలన్నారు. జగనన్న కాలనీల్లో పూర్తి అయిన ఇళ్లకు విద్యుత్తు మీటర్లను అమర్చాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని