logo

పంట దిగుబడుల కొనుగోలుకు సిద్ధం కండి

పంట దిగుబడులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, పౌరసఫరాల సంస్థ జిల్లా అధికారి అర్జునరావు పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 02:22 IST

మాట్లాడుతున్న డీఏవో నాగేశ్వరరావు, పక్కన అధికారులు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే : పంట దిగుబడులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, పౌరసఫరాల సంస్థ జిల్లా అధికారి అర్జునరావు పేర్కొన్నారు. శనివారం వ్యవసాయశాఖ జిల్లా సమావేశ మందిరంలో పంట దిగుబడులు కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు దిగుబడులను తీసుకొస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ పరిధిలో ఈ సారి కొత్తగా రాగి, జొన్నలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 9, సహకార సంఘాల ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయని పౌరసరఫరాల సంస్థ జిల్లా అధికారి అర్జునరావు పేర్కొన్నారు. రాగులు క్వింటా రూ.3,578, జొన్నలు హైబ్రీడ్‌ రకం రూ.2,970, మాల్‌దండి రకం రూ.2,990తో కొనుగోలు చేస్తారన్నారు. రైతులు ఈ నెల 6వ తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.  మార్క్‌ఫెడ్‌ పరిధిలో శనగ, మినుములు కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. శనగ క్వింటాకు రూ.5,335, మినుములు రూ.6,600  మద్దతు ధర ఉందన్నారు. సమావేశంలో డీసీఓ సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని